రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
Published on Wed, 07/12/2023 - 11:33
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు.
ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు.
చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!
Tags : 1