అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
సైలెంట్ పుంజు.. వయలెంట్ విజయం
Published on Thu, 01/16/2025 - 11:42
భీమడోలు: ఏలూరు జిల్లా కోడి పందేల బరిలో ఓ పుంజు చిత్రమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘నేనెప్పుడూ సైలెంట్.. నా జోలికొస్తే మాత్రం మహా వయలెంట్’ అన్నట్టుగా మూడు కోడి పుంజుల్ని వీరోచిత పటిమతో ఓడించిన రసంగి పుంజును అబ్రాస్ పుంజు మట్టికరిపించింది. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఓ భారీ బరిని ఏర్పాటు చేశారు. బుధవారం చివరగా ఓ పందెం వేశారు. ఒకేసారి ఐదు కోడి పుంజులను బరిలోకి దింపారు.
వాటిలో ప్రారంభం నుంచి సైలెంట్గా ఉన్న అబ్రాస్ కోడి పుంజు వేరే పుంజుల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయింది. కాగా.. రసంగి కోడి పుంజు మిగిలిన మూడు పుంజులపై వీరోచితంగా పోరాడి వాటిని మట్టి కరిపించింది. చివరగా నక్కినక్కి ఉన్న అబ్రాస్ కోడి పుంజుని పొడిచేందుకు వెళ్లిన రసంగిని అబ్రాస్ పుంజు ఒకే ఒక్క దెబ్బతో నేల కరిపించింది. ఈ పందేన్ని చూసిన వారంతా ‘సైలెంట్ పుంజు.. వయలెంట్’ విజయం.. అని వ్యాఖ్యానించారు.
Tags : 1