Breaking News

తగ్గని వేడి..పందెం కో‘ఢీ’

Published on Wed, 01/17/2024 - 05:36

భీమవరం/అమలాపురం టౌన్‌: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలు మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరం, సీసలి, పెన్నాడ, యలమంచిలి మండలం కలగంపూడి, పూలపల్లి, పోడూరు మండలం కవిటం, వీరవాసరం మండలం జొన్నలపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి.

ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో పందేల జోరు కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా చేతులు మారినట్టు చెబుతున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పందేల రాయుళ్లను ఆకర్షించేందుకు భీమవరం సమీపంలోని పెన్నాడ శిబిరం వద్ద ఎక్కువ పందేలు గెల్చుకున్న వారికి బుల్లెట్, స్కూటీ వంటి వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. చిన్న గ్రామాల్లో సైతం కోడి పందేల జోరు కనిపించింది. 

తూర్పున 80 బరుల్లో.. 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 80 ప్రధాన బరుల్లో కోడి పుంజులు తలపడ్డాయి. హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి కోడి పందేల బరుల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో వెలిసిన భారీ పందెం బరిలో రూ.కోట్లు చేతులు మారాయి.

మలికిపురం, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం రూరల్, అల్లవరం, రాయవరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వెలిసిన బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, పులిమేరు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పందెం కోళ్లు సై అంటే సై అన్నాయి. కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు, ఉప్పులూరు, గొడవర్రు, అంపాపురం, కంకిపాడు, కొత్తూరు తాడేపల్లి, మేకావానిపాలెం, ఎనీ్టఆర్‌ జిల్లా వెలగలేరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)