Breaking News

కింగ్‌ కోబ్రా నోట్లోంచి బయటపడ్డ మరో పాము..!

Published on Mon, 06/22/2026 - 12:37

పార్వతీపురం మన్యం జిల్లా: మండలంలోని వత్తాడ గ్రామంలో సోమవారం కింగ్‌ కోబ్రా(గిరినాగు) ఆందోళన సృష్టించింది. ఈమేరకు గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర సోమవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి శబ్దం వినిపించగా బీరువావైపు చూడడడంతో ఏ సమయంలో దూరిందోగానీ బీరువాపై భాగంలో కింగ్‌ కోబ్రా ముడుచుకుని (చుట్టుకుని) కనిపించింది. దీంతో భయాందోళన చెందిన పొట్టిందొర కుటుంబీకులతో పాటు బయటికి వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో..పాముకు ఎటువంటి హాని చేయకుండా స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. 

స్పందించిన అటవీశాఖ అధికారులు వత్తాడ గ్రామానికి వెళ్లి కింగ్‌కోబ్రాగా గుర్తించి..స్నేక్‌క్యాచర్స్‌కు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వత్తాడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్న స్నేక్‌ క్యాచర్స్‌ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతలో కింగ్‌కోబ్రా తన నోట్లోంచి మరో చచ్చిన పాము (జెర్రిపాము)ను బయటకు కక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కింగ్‌ కోబ్రా మరోపామును అమాంతం మింగడం వల్లనే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై తనంతటతాను చుట్టుకుని ఉండిపోయిందని, లేకుంటే పెనుప్రమాదమే జరిగుండేదంటూ స్థానికులంతా వాపోయారు. కింగ్‌ కోబ్రాను పట్టుకున్న స్నేక్‌క్యాచర్స్‌ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)