Breaking News

అమ్మా వెళ్లొస్తా..!

Published on Sat, 07/05/2025 - 11:36

కర్నూలు: ‘అమ్మా.. బాయ్‌.. బాయ్‌..’ అంటూ ఉదయం స్కూల్‌ బస్సులో వెళ్లిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. బస్సులో బిడ్డను చూసి ఆ తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైంది. కళ్ల ముందే బిడ్డపై బస్సు చక్రాలు వెళ్లడంతో ఆ తల్లి తల్లడిల్లింది. ఉదయం బడికెళ్తూ తన బిడ్డ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంది. రక్తపుమడుగులో తడిసి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. 

బడి బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటమైంది. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంవీనగర్‌కు చెందిన శ్రీధర్‌, వనజ దంపతుల కూతురు హరిప్రియ (4) స్థానిక కీర్తన స్కూల్‌లో యూకేజీ చదువుతోంది. సోమవారం నుంచి స్కూల్‌కు వెళ్తుండగా రోజూ తండ్రి శ్రీధర్‌ వదిలి, తిరిగి తీసుకొచ్చేవారు. అయితే శుక్ర వారం నుంచి స్కూల్‌ బస్సులో పంపడం మొదలు పెట్టారు. స్కూల్‌ ముగించుకుని మొదటిసారిగా బస్సులో వస్తున్న కూతురుని దించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయిబాబా గుడిదగ్గర తల్లి వనజ వేచి ఉంది. 

బస్సులో నుంచి అమ్మను చూసిన ఆ చిన్నారి ‘అమ్మా నేను దిగుతున్నా.. అని చెయ్యి ఊపుతూ’ ఇవతలి వైపున దిగింది. ఆ తర్వాత అవలి వైపున ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేసింది. అంతలోనే డ్రైవర్‌ బస్సు కదిలించడంతో చిన్నారి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డ మృతితో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ నగీన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)