Breaking News

భోజనంలో బల్లి.. కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత

Published on Thu, 07/31/2025 - 04:57

తెనాలి అర్బన్‌: శిక్షణ నిమిత్తం వచ్చిన కస్తూ­రిబా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యా­యినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం రాత్రి జరిగింది. సర్వశి­క్షా­అభియాన్‌ అధికారుల కథనం ప్రకారం..రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆర్ట్స్‌ ఉపాధ్యాయి­నులు సుమారు 200 మంది శిక్షణలో భాగంగా సోమవారం ఉదయం తెనాలి జేఎంజే మహిళా కళాశాలకు చేరుకున్నారు. వీరందరికీ సర్వశిక్షా­అభియాన్‌ అధికారులు అదే కళాశాల ఆవరణ­లో వసతి ఏర్పాటుచేశారు. 

వారికి ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యా­హ్నం, రాత్రికి భోజనం అందిస్తూ వచ్చారు.  బుధవారం రాత్రి కూడా ఉపాధ్యాయినులందరూ భోజ­నం చేశారు. అయితే, భోజనంలో బల్లి కనిపించిందని వారు ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం.. వారిలో 50 మందికి పైగా వాంతులు, విరేచ­నాలు అయినట్లు తెలిసింది. అస్వస్థతకు గురైన వారిలో బాలింతలు, గర్భిణులు, హార్టు పేషెంట్లు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ట్యాబ్‌లెట్లు ఇచ్చి సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

కానీ, వారిలో 10 మందికి వాంతులు, విరేచ­నాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. దీనిపై సర్వశిక్షాఅభియాన్‌ రాష్ట్ర అధికారి రవీంద్రారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఉపాధ్యాయి­నులు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)