Breaking News

AP: ఇలా ఉంటే పింఛన్‌ వెరిఫికేషన్‌ అవసరమా..?

Published on Sun, 08/17/2025 - 17:31

కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్‌ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్‌, సాహిన్‌ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్‌ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. 

పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. 

ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్‌ సర్టిఫికెట్‌ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్‌ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

మనిషి ఎముకల గూడు మాదిరి ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది. అతని పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనక మానరు ఎవరైనా.. మరి ఇలా ఉన్న మనిషికి సర్టిఫికేట్‌.. దానికి వెరిఫికేషన్‌ అంటూ పింఛన్‌ పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకూ కరెక్ట్‌ అనేది సదరు అధికారులకే తెలియాలని విమర్శకులు అంటున్నారు. తనను చూస్తే జాలేయడం లేదా?అనేది మాత్రమే అతని చూపుల్లో కనిపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)