Breaking News

స్కూల్‌లో క్షుద్రపూజలు?.. వారి పనేనా?

Published on Sat, 08/02/2025 - 19:24

కాకినాడ జిల్లా(సామర్లకోట): స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్‌ హైస్కూల్‌లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్‌వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు.

విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హెచ్‌ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు.

ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎం తెలిపారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)