Breaking News

భళా.. కైవల్య!

Published on Sun, 01/21/2024 - 06:22

నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ప­ట్ట­ణానికి చెందిన కుంచాల కైవల్యరెడ్డి (15) వ్యోమగామి కావాలన్న కలను నెరవేర్చుకునే దిశగా ఓ అ­డుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్‌పీ (ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌) కో­ర్సు­ను విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎ­యిర్‌స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయి­ర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏఎస్‌పీ) శిక్షణ అందిస్తోంది.

విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగావిుకి సంబంధించిన పలు ఆంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది. 2023లో భారత్‌ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు. ఆమె ప్ర­స్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూ­ర్తి చేస్తున్న భారతీయురాలిగా రికార్డు సైతం న­మో­దు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం న­డపడం, మల్టీ యాక్సెస్‌ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్‌ తదితర ఆంశాలల్లో కైవల్య శిక్షణ తీసుకుంది. 

కైవల్య సాధించిన విజయాలివీ
► ఆస్టరాయిడ్‌ను గుర్తించి.. స్పేస్‌ పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ (న్యూఢిల్లీ) అంబాసిడర్‌ బృంద సభ్యు­రాలిగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది.  
► అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరఫున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న కైవల్యరెడ్డి­ని 2023లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతి అందించారు.
► కైవల్య ఇటీవల అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు సొంతం చేసుకుంది. 
► జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్‌ అస్ట్రానమి, ఆస్ట్రో ఫిజిక్స్‌ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రతిభా పోటీలలో కైవల్యరెడ్డి మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్‌ ఆనర్‌ను సాధించింది. 

వ్యోమగామి కావాలన్నదే లక్ష్యం
వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా ఐఏ­ఎస్‌పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశా­ను. నా లక్ష్యానికి ఇది తొలి మెట్టు. ఈ స్ఫూ­ర్తితో భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వం నుంచి రూ.6.70 లక్షలు మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.  – కుంచాల కైవల్యరెడ్డి

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)