Breaking News

జస్టిస్‌ సోమయాజులు పదవీ విరమణ!

Published on Tue, 09/26/2023 - 03:43

సాక్షి, అమరావతి: హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు çపలికింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్‌ సోమయాజుల కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తు  లు, రిజి్రస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వొ కేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌. హరినాథ్‌ మాట్లాడారు. 

అన్ని రకాల కేసులను పరిష్కరించారు : సీజే 
తొలుత.. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్‌ సోమయాజులు అందించిన సేవలను కొనియాడారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబం నుంచి న్యాయ వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. జిల్లా కో ర్టులో న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తి అయి న తొలి వ్యక్తి రాష్ట్రంలో సోమయాజులేనన్నారు. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోయిందన్నారు.  ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని సీజే ఆకాక్షించారు.

మంచి వాదనలతోనే మంచి తీర్పులు : జస్టిస్‌ సోమయాజులు
అనంతరం.. జస్టిస్‌ సోమయాజులు మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిగా కక్షిదారులకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశానన్నారు. న్యాయ­మూర్తిగా తన ఇన్నేళ్ల ప్రస్తానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ­వాదులు వినిపించే మంచి వాదనలతోనే మంచి తీర్పులు ఇవ్వడం సాధ్యమైందన్నారు.  జస్టిస్‌ సోమ­యా­జులు దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం  ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి చిత్రపటం బహూకరించారు.

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)