ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు

Published on Sun, 07/14/2024 - 08:45

విజయవాడ, సాక్షి: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు ఇచ్చారు. రెండ్రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్‌లో వైద్యులపై దాడి జరిగింది. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూడాలు..వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా  ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు జారీ చేశారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు

చర్చలు విఫలం
వైద్యులపై దాడికి నిరసనగా గత రెండ్రోజులుగా విజయవాడ జీజీహెచ్‌లో జూడాలు సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలు బహిష్కరించి నిరసనను కొనసాగిస్తున్నారు.మరోవైపు జూడాల నిరసనలు, సమ్మె నోటీసుపై వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌, జూడా ప్రతినిధులతో డీఎంఈ నరసింహం వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా  ప్రభుత్వం హామీ ఇవ్వాలని జూడాల డిమాండ్‌ చేశారు.

హామీలపై అసంతృప్తి
విజయవాడలో దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపిన డీఎంఈ తెలిపారు. డ్యూటీ రూములో తగిన సదుపాయాలని కల్పించడానికి ఆదేశాలిచ్చామని చెప్పారు. అయితే డీఎంఈ నరసింహం హామీలపై సంతృప్తి చెందని జూడాలు.. సమ్మెపై ఆదివారం నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)