పెరిగిన డ్రోన్‌ పైలెట్లు!

Published on Tue, 07/25/2023 - 06:01

దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు

సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్‌ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమ­వారం పార్లమెంట్‌లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశ­వ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టి­ఫైడ్‌ డ్రోన్‌ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. 

అనేక రంగాల్లో వినియోగం..
ఇక డ్రోన్స్‌ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్‌ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్‌ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తె­లిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మ­రో­వైపు.. డ్రోన్స్‌ రిమోట్‌ పైలెట్‌ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే  గుంటూరులో రెండు సం­స్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అ­­నుమతించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియో­గాన్ని పెంచ­డం ద్వారా రైతులకు చేదోడు వాదో­డుగా ఉండేందు­కు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కి­సాన్‌ డ్రోన్స్‌ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 

రైతుల ఖర్చులు తగ్గించేందుకు..
డ్రోన్‌ రిమోట్‌ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్‌ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పు­రుగు మందులు, పోషకాలను పిచికారీ చేయ­డానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పా­దకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)