Breaking News

దీపావళికి ముందే వెలుగులు

Published on Mon, 11/06/2023 - 04:37

సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్థం చేసుకుని ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించడం ద్వారా జర్నలిస్టుల కుటుంబాల్లో దీపావళికి ముందే వెలుగులు నింపారని విశాఖపట్నం జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తంచేశారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక బీచ్‌ రోడ్డులో ‘సీఎం వైఎస్‌ జగన్‌కు విశాఖ జర్నలిస్టుల వందనం’ పేరుతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సీ హారియర్‌ మ్యూజియం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో జర్నలిస్టులు థాంక్యూ సీఎం సార్‌.. అంటూ నినాదాలు చేశారు. బీచ్‌ రోడ్డులో ఉన్న మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

విశాఖ అక్రిడేటెడ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేజీ రాఘవేంద్రారెడ్డి, జి.జనార్థన్, అధ్యక్షుడు బి.రవికాంత్, ఇండియన్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ఆర్‌.రామచంద్రరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణ, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు అశోక్, చందూయాదవ్, పీఎన్‌ మూర్తి, సాంబశివరావు, దుక్కా మురళీకృష్ణరెడ్డి, కో­యిలాడ పరుశురాం, బందరు శివప్రసాద్, ఉప్ప­ల భాస్కరరావు, ప్రసాద్, ఈశ్వర్, రవిచంద్రతోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)