సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు

Published on Wed, 11/08/2023 - 19:16

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్‌ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు.

జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సీఎంని కలిసిన వారిలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్‌ యూనియన్‌ నేతలు జి.ఆంజనేయలు, ఎస్‌.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీఆర్‌ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.



చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)