Breaking News

ఉపాధికి 'నూతన ఎనర్జీ'

Published on Tue, 01/14/2025 - 04:42

సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగం పురోగమిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2050 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 43 మిలియన్‌ల మంది కావాల్సి ఉంటుందని తాజాగా ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన సం­యుక్త నివేదికలో వెల్లడించాయి.

ఇంజ­నీర్లు, నైపుణ్యం గల కార్మికులు, మధ్యస్థ నైపుణ్యం గల కార్మికులు, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్, ఇతర కార్మికుల సేవలు ఎక్కువగా అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 16.2 మిలియన్‌ల మంది పని చేస్తున్నారని, వారిలో మన దేశంలోనే 1.2 మిలియన్‌ల మంది ఉన్నారని తెలిపాయి.  

విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉపాధి అవకాశాలు
⇒ దేశంలో 2032 నాటికి విద్యుత్‌ వినియోగం మరో 70 శాతం పెరుగుతుందని అంచనా.

⇒ 2070 నాటికి కర్బన ఉద్గారాలు నెట్‌ జీరో స్థాయిని చేరుకోవడంలో భాగంగా 2030 నాటికి దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగు­ణంగా అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించాలని సూచించింది.  

⇒ అందువల్ల మన దేశంలో కొత్తగా ఏర్పడే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 2050 నాటికి 8.5 మిలియన్‌ల మందికి కొలువులు లభిస్తా­యని ఐఆర్‌ఈడీఏ వివరించింది.  

⇒ ఈ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్‌ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే అది శిలాజ ఇంధనాల నుంచి కాకుండా స్వచ్చ ఇంధనం(గ్రీన్‌ ఎనర్జీ) ద్వారానే జరగాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు...
⇒ ప్రపంచ పునరుత్పాదక రంగానికి సంబంధించి 2022లో 4.9 మిలియన్‌ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో 2022లో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్‌లకు చేరాయి. అదే 2023లో ఆ సంఖ్య 16.2 మిలియన్‌లకు పెరిగింది. 

⇒ మన దేశానికి సంబంధించి 2022లో 2,82,200 మందికి ఈ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి.  
⇒ 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. జలవిద్యుత్‌ రంగంలో అత్యధికంగా దాదాపు 4,53,000 మందికి ఉద్యోగాలు లభించాయని అంచనా. సౌర విద్యుత్‌ ఫొటో వాల్టాయిస్‌ రంగంలో 3,18,600 మందికి ఉపాధి లభించింది. పవన విద్యుత్‌ రంగంలో సుమారు 52,200 మందికి, ద్రవ జీవ ఇంధన రంగంలో 35వేల మందికి, బయోమాస్‌లో 58 వేల మందికి, సోలార్‌ హీటింగ్, కూలింగ్‌ సెక్టార్‌లో 17 వేల మందికి, బయోగ్యాస్‌ రంగంలో 85 వేల మందికి కొలువులు లభించాయి.  

⇒ భారతదేశంలో 2023లో దాదాపు 10,18,800 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఆర్‌ఈఎన్‌ఏ, ఐఎల్‌వో వెల్లడించాయి.  
⇒    ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ రంగంలో పురోగమనంలో ఉంది. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)