Breaking News

టచ్‌ చేసి చూడు!

Published on Mon, 06/30/2025 - 03:37

సఖినేటిపల్లి: తూర్పు తీరంలో జెల్లీ షిష్‌లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో హైడ్రోజోవా తరగతికి చెందిన విష పురుగులు పెద్దఎత్తున తీరానికి చేరుకుంటున్నాయి. జెల్లీ ఫిష్‌లలో ఒక వర్గానికి చెందిన బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ అంతర్వేది బీచ్‌లో అధికంగా సంచరిస్తున్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిని ‘అగ్గిబాటా’లని పిలుస్తున్నారు.

పొరపాటు గానీ.. అందంగా ఉన్నాయని మక్కువతో వీటిని తాకితే అంతే సంగతులు. వాటిని తాకుతున్న వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో భారీ గాలులకు, సముద్రం ఆటుపోట్ల సమయాల్లో ఇవి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని తప్పించుకునేందుకు స్వచ్ఛమైన సముద్ర తీరానికి సైతం వస్తుంటాయి. ఇవి సమూహంగా జీవిస్తూ.. నీటిపై తేలియాడుతూ సమూహంగానే ఒడ్డుకు వస్తుంటాయి.  

బ్లూ డ్రాగన్‌ జెల్లీ విషపూరితమే 
అంతర్వేది బీచ్‌లో గుర్తించిన బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ మాత్రం పూర్తిగా విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్‌ అట్లాంటికస్‌. ఇది బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్‌లను ఆహారంగా తీసుకుంటుంది. బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌లో ఈకల వంటి నీలిరంగు పువ్వులను తలపించే భాగాన్ని తాకితే అంతే సంగతి. వాటిల్లో విషం ఉంటుంది. ఈ ఫిష్‌ వెనుక భాగంలో గాలి బుడగ మాదిరి నిర్మాణం ఉంటుంది. అందువల్ల ఇవి కూడా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ వంటి సమస్యలకు లోనవుతారు.

తాకితే ఇబ్బందులే
చేపలు కాకపోయినా వీటి పేరు చివర ఫిష్‌ అని ఉండటం వల్ల వీటిని కూడా కొందరు జలపుష్పాలుగా భ్రమించే అవకాశం ఉంది. నిజానికి ఇవి ఒక రకమైన సముద్ర జీవులు. వీటిని ఎవరైనా తాకితే కుడతాయి. తద్వారా అలెర్జీ వచ్చి శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుడతాయి. అంతర్వేది తీరంలో గుర్తించిన బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్‌ విషపూరితం కాదని మత్స్యకారులు చెబుతున్నారు. 

బటన్‌ వంటి ఆకారాన్ని పోలి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామం పోర్పిటా పోరి్పటా. దీని శరీర భాగంలో ఫోటో అనే గ్యాస్‌ నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఉండే స్పర్శకాల(టెంటకిల్స్‌)లో నెమటోసిస్ట్‌ అనే కణాలుంటాయి. మనుషులు లేదా ఏదైనా జీవి వీటిని తాకితే తమను తాము రక్షించుకోవడానికి ఈ జెల్లీ ఫిష్‌లు టెంటకిల్స్‌తో కుడతాయి. ఇవి కుట్టడం ప్రాణాంతకం కాదని సైన్స్‌ 
నిపుణులు అంటున్నారు.

ప్రాణాంతకం కాదు కానీ..
వీటి స్పర్శకాలలో నిమటోసిస్ట్‌ అనే విషపదార్థం ఉంటుంది. ఇవి వలలో పడితే బాక్స్‌ (పెట్టె) ఆకారంలో శరీరాన్ని పట్టుకుని తీయాలి తప్ప స్పర్శకాలను తాకకూడదు. ఇవి కుడితే ప్రాణాంతకం కాదు. కానీ.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తుంటాయి. పొరపాటున వీటివల్ల ఏదైనా అపాయం జరిగితే ఎసిటిక్‌ యాసిడ్‌(వెనిగర్‌)లో గుడ్డను లేదా దూదిని ముంచి శరీరంపై పెట్టాలి. ఆ తర్వాత తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.  – డాక్టర్‌ దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్‌సీ 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)