Breaking News

మొదటి సెషన్‌ కంటే సులభమే!

Published on Thu, 04/03/2025 - 05:53

సాక్షి, ఎడ్యుకేషన్‌: జేఈఈ మెయిన్‌–2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొ­లి­రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశా­రు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్‌లో రసాయన శాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. న్యుమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పా­రు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ లోంచి ప్రశ్నలను ట్విస్ట్‌ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు.

సాధారణంగా ఫిజిక్స్‌లో మధ్యస్తంగా స్కోర్‌ చేసేందుకు అ­వకాశం ఉండేది. ఈసారి మాత్రం కెమెస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్‌ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్న­ట్టు నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్‌ ఈక్వేషన్స్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. 

సబ్జెక్టులవారీగా ఇలా..
» మొదటి షిఫ్ట్‌ ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని, ఫిజిక్స్‌ విభాగం క్లిష్టంగా, మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా, మిగతా రెండు విభాగాలతో పోల్చితే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. 
» ఫిజిక్స్‌లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, ఆ­ప్టిక్స్‌ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. 
» కెమిస్ట్రీలో ఈసారి ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలడిగారని అంటున్నారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోంచి నేరుగా అడిగారు. 
» మ్యాథమెటిక్స్‌ విభాగంలో జనవరి సెషన్‌తో పోల్చితే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని, 5 ప్రశ్నలు డైరెక్ట్‌ ఫార్ములా ఆధారంగా అడిగారని చెబుతున్నారు.

గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా..
రెండో సెషన్‌లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు.. గత ప్రశ్న పత్రాల నుంచే అడిగారు. వీటిని బాగా ప్రాక్టీస్‌ చేసిన వారు ఎక్కు­వ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. ఫా­ర్ములాలు, కాన్సెప్ట్‌లపై అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలున్నాయి. కెమిస్ట్రీలో మిక్స్‌డ్‌ కాన్సెప్ట్‌ కొశ్చన్స్‌ అడిగారు. మ్యాథమెటిక్స్‌లో 52–56 మార్కులు; ఫిజిక్స్‌లో 75–85 మార్కులు; కెమిస్ట్రీలో 60–65 మా­ర్కులతో 99 పర్సంటైల్‌ పొందే అవకాశం ఉంది. – ఎం.ఎన్‌. రావు, జేఈఈ శిక్షణ నిపుణులు

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)