Breaking News

నేటి నుంచి జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్షలు 

Published on Thu, 04/06/2023 - 03:03

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో  జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్‌లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది.

రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్‌  తొలి సెషన్‌కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్‌టీఏ సూచించింది.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)