Breaking News

హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి

Published on Fri, 02/24/2023 - 03:55

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందా­రు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పు­టూరు వేణు­గోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్‌లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొ­త్తం 1,438 ఓట్లు పోల్‌ కాగా.. జానకీ­రామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌­బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు.

వేణు­గోపాలరావు విజయా­వకాశా­లను ప్ర­సాద్‌­బాబు ప్రభావితం చేశారు. న్యా­య­వాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీ­రామి­రెడ్డి గెలు­పొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండు­సార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్‌పీ సురేష్‌కుమార్‌ గెలు­పొం­దారు. ఆయన తన సమీప అభ్యర్థి తు­హిన్‌ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్‌కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్‌ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్య­దర్శిగా సాల్మన్‌ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమ­రాజు­పై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వర­రావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్య­దర్శిగా చంద్రశే­ఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలి­చారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా అన్నం శ్రీ­ధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్న­పూర్ణ, షేక్‌ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యు­తరా­మయ్య విజయం సా­ధిం­చారు. ఎన్ని­కల అధి­కారిగా విజయ్‌­కుమార్‌ వ్యవహరించారు. ఎ­న్ని­­క­ల్లో జానకీ­రామిరెడ్డి వర్గం ఓవైపు నిలవ­గా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జన­సేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)