Breaking News

జనసేన పార్టీ గుర్తుతో విద్యార్థులకు గ్లాసుల పంపిణీ

Published on Sat, 01/03/2026 - 08:22

కృష్ణా జిల్లా: బడి పిల్లలకు స్టీలు గ్లాసులు పంపిణీ చేస్తామంటే పెద్ద మనుతో ఇస్తున్నారని అనుకున్నారంతా.. ఆనక ఆ గ్లాసులపై పార్టీ గుర్తులు వేసి ఇవ్వడంతో రాజకీయ ప్రచారానికా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో రాజకీయ గుర్తులకు, పార్టీ నేతలు, ఇతరుల ప్రవేశానికి పలు నిబంధనలు విధిస్తూ చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. 

నాయకులు, ఇతరులు పాఠశాలలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్‌ అనుమతి తప్పనిసరి. రాజకీయ గుర్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేవు. ఇందుకు విరుద్ధంగా శుక్రవారం కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు ఉన్నత పాఠశాలలో స్థానిక జనసేన నేతలు స్టీలు గ్లాసులపై జనసేన గుర్తు వేసి మరీ పంపిణీ చేయడం విమర్శలకు దారి తీసింది. 

ఈ విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. వాట్సప్‌ గ్రూపుల్లో రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు స్పందించి ఆ పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు తెలిసింది. ఉన్నతాధికారి ఆదేశాలతో కంగుతిన్న ఉపాధ్యాయులంతా విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి రాజీచేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)