నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా?

Published on Tue, 08/26/2025 - 06:15

కోనేరుసెంటర్‌: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక జనసేన నేత రెచ్చిపోయాడు. నైట్‌ బీట్‌ డ్యూటీలో ఉన్న హోంగార్డును చావచితక్కొట్టాడు. అదేమని అడిగిన కానిస్టేబుల్‌ను దుర్భాషలాడా­డు. జనసేన నాయకుడి చేతిలో తీవ్రంగా గాయపడిన హోంగార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కానిస్టేబుల్‌ బాషా, హోంగార్డు మోహనరావు మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి విశ్వబ్రాహ్మణ కాలనీలోని బీట్‌ పాయింట్‌లో ఉన్న పుస్తకంలో సంతకం చేసేందుకు వెళ్ళా­రు. కానిస్టేబుల్‌ నోట్‌ బుక్‌ లో సంతకం పెడుతుండగా, మోహనరావు పక్కన ఉన్న బల్లపై కూర్చున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీ ఎనిమి­దో డివిజన్‌ ఇన్‌ఛార్జ్, జనసేన నాయకుడు కర్రి మహేష్‌ బైక్‌ వచ్చి అక్కడ ఆగాడు. ‘‘ఏంట్రా నన్ను చూసి కూడా నిలబడటంలేదంటూ’’ మో­హ­నరావును ఏక వచనంతో సంబో­ధిస్తూ తన అహంభావాన్ని ప్రద­ర్శించాడు.

‘‘నేను వ­చ్చా­క కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోం­గార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయతి్నంచాడు. పక్క­నే ఉన్న కానిస్టేబుల్‌ బాషా... జనసేన నేత దుశ్చర్యను అడ్డుకొని పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయతి్నంచాడు. పూటుగా మద్యం సేవించి ఉన్న కర్రి మహేష్‌ కానిస్టేబుల్‌ను సైతం దుర్భాషలాడి పక్కకు తోసి, హోంగార్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన హోంగార్డును కర్రి మహేష్‌ బారి నుంచి తప్పించిన కానిస్టేబుల్, చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించాడు. కాగా, ఈ ఘటనపై మోహనరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు మహే­ష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా, కర్రి మహే‹Ùను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)