Breaking News

మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’తో భరోసా

Published on Fri, 10/20/2023 - 05:06

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కా­రమే లక్ష్యంగా మండలాల స్థాయిలోనూ చేప­ట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సత్ఫ­లి­­­తాలనిస్తోంది. కలెక్టర్లు, జిల్లాల అధికారులు స్వయంగా హాజరై వినతులు స్వీకరించి.. వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పి­స్తు­న్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరి­ష్కారానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్య­క్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కా­రానికి కృషి చేస్తోంది. అలాగే ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు కూడా జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమ­స్యలను వీలైనంత త్వరగా పరిష్క­రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, ప్రజా సమ­స్యలను మరింత సంతృప్త స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం ఈ ఏడాది మే నెలలో ‘జగనన్నకు చెబు­దాం’ కార్య­క్రమాన్ని ప్రారంభించింది. 1906 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా సమస్యలు తెలియ­జేస్తే.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు నాలుగు స్థాయిల్లో ఆడిట్‌ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. సీఎంవో అధికారులు, శాఖాధిపతులు, కలెక్టరేట్, మ­ండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల నుంచి మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు నిర్వ­హిస్తున్నారు.

ఏ రోజు.. ఏ మండల కేంద్రానికి కలెక్టర్లు, అధికారులు వస్తారో ముందే తెలి­య­జేస్తున్నారు. దీంతో ప్రజలు ఆయా మండల కేం­ద్రాలకు వెళ్లి కలెక్టర్లను కలిసి తమ సమ­స్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వచ్చిన విన­తులను అధికారులు అదే రోజు ‘జగనన్నకు చెబు­­­దాం’ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్ప­­టివరకు ప్రజల నుంచి 13,365 సమ­స్యలపై వినతులు వచ్చాయి. ఇందులో 4,517 పరిష్కారమవ్వగా.. 8,777 సమస్యలు పరి­ష్కా­ర దశలో ఉన్నాయి. రీ ఓపెన్‌లో 71 సమ­స్య­లు­న్నాయి. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడి­యో కాన్పరెన్స్‌లో సీఎస్‌ డా.కె.ఎస్‌.­జవ­హర్‌­­రెడ్డి ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వ­హించి.. పురోగతిని తెలుసుకున్నారు. అలాగే అధికా­రు­ల­కు పలు సూచనలు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)