Breaking News

‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’

Published on Fri, 03/01/2024 - 12:35

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌  కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే  విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్‌ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. 

‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’
అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్‌ తర్వాత నాన్నకు హార్ట్‌ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్‌ సీట్‌ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్‌షిప్‌ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్‌ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇచ్చారు, మీలాంటి విజన్‌ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. 
- శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు

‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
మాదొక పేద  కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి.  మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్‌ ఎంసెట్‌ ఎగ్జామ్‌ రాయడానికి అదే కాలేజ్‌కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు.

అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా.  విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. 

మాల్కం గ్లాడ్‌వెల్‌ అనే ఇంగ్లీష్‌ రైటర్‌ టెన్‌ థౌజండ్‌ అవర్స్‌ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్‌ అవర్స్‌ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్‌ ప్రొఫెషనల్‌ దిల్షాద్‌గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ.
-దిల్షాద్‌, విద్యాదీవెన లబ్ధిదారు

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)