Breaking News

ఇక రూ.25లక్షల వరకు ‘ఆరోగ్యశ్రీ’ 

Published on Mon, 12/18/2023 - 02:58

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దానిని మరింత బలోపేతం చేసే కార్యక్ర­మా­న్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభిం­చనున్నారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతోపాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంపు కార్యాల­యం నుంచి ప్రారంభిస్తారు.

అలాగే, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించడం.. దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

ఇక కొత్త కార్డుల పంపిణీ సందర్భం­గా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్‌లో ఆరో­గ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీ­ర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతి­నిధులు స్వయంగా చూస్తారు. తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు, 4.25 కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పిస్తారు. 

జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 
ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి ప్రతీవారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో ప్రతీవారం ఒక వార్డు పరిధిలో సురక్ష శిబిరాలు నిర్వహిస్తారు. 

♦ ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విలేజ్‌ క్లినిక్‌లకు మందులు చేరవేసి అక్కడి నుంచి ఏఎన్‌ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటివద్దనే డబ్యుహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలుగల మందులు ఉచితంగా అందిస్తారు. 
♦ ఈ మందులు అయిపోయిన తరువాత వాటి కో­సం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానం చేసి డోర్‌ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. 

కొత్త కార్డుల ఫీచర్లు ఇవే..  
♦  ప్రతీ కార్డులో క్యూఆర్‌ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్‌ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్‌ఏ ఐడీ ఉంటుంది. 
♦ ఈ క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ అవడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్‌ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు.  
♦ అలాగే,  ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలుంది.  
♦ దీని ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన.. మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం కానుంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)