Breaking News

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం

Published on Wed, 10/11/2023 - 05:26

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయం’ అంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ కొనియాడారు. మంగళవారం ఆయన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను ప్రశంసిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘బేస్‌లైన్‌ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్‌ స్క్రీనింగ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టారు.

తెలుగునాట మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ రూపంలో, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ‘ఆరోగ్య సురక్ష’ ద్వారా అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జీవం పోశారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేవలం అనారోగ్యం, సరైన వైద్యం అందక, వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం శుభపరిణామం.

ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటంతో.. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ వీడియో సందేశంలో జయప్రకాశ్‌ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)