Breaking News

అప్పులు లేకుండా ఆనందంగా..

Published on Sat, 04/20/2024 - 01:25

ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి

2019లో రాష్ట్రంలో వెఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్‌లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్‌ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్‌ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది.

ఆర్థిక సమస్యలు తీరాయి 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది.   – కర్తల చిరంజీవులు

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)