Breaking News

ఉన్నత చదువులకు జగనన్న దీవెన

Published on Wed, 04/17/2024 - 05:11

మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన బోనాసి జాన్‌బాబు మండల పరిధిలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన భార్య బోనాసి రేచల్‌ గృహిణి. వారికి ఇద్దరు కుమా­రులు, ఒక కుమార్తె. అత్త వెంకటమ్మ ఆలనాపాలనా కూడా వీరి­దే. చర్చికి వచ్చే దాతలు ఇచ్చే అరకొర కానుకలతో కుటుంబ పోషణ భారంగా నడిచేది. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులెలా? అన్న భయం వెంటాడేది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబం దిశ తిరిగింది. సంక్షేమ పథకాలు ఆ ఇంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాయి.

పాస్టర్‌ జాన్‌బాబు పెద్ద కుమారుడు బోనాసి విలియయ్‌బాబు మదనపల్లె సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బిటెక్‌ చేశాడు. విద్యాదీవెన కింద రూ.3,28,000, వసతి దీవెన కింద రూ.20,800 అందాయి. దీంతో విజయ్‌బాబు చదువు సాఫీగా సాగింది. బీటెక్‌ పూర్తవడంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ విద్యాదీవెన కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.51 లక్షలు మంజూరైంది. ప్రస్తుతం అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న మోనాస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు.

కుమార్తె బోనాసి ఏంజెల్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఆమెకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.75 వేలు లబ్ధి చేకూరింది. చిన్నబ్బాయి బోనాసి బిడియన్‌ 7వ తరగతి చదువుతున్నాడు. జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇలా చదువుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. పైసా ఖర్చు లేకుండానే తన బిడ్డల్ని చదివించుకుంటున్నట్లు జాన్‌బాబు తెలిపారు. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంతో సగర్వంగా బతుకుతున్నట్లు చెప్పారు. ఆయన అత్త వెంకటమ్మకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్‌ అందుతోంది.    –మదనపల్లె సిటీ

కుటుంబ ఆర్థిక పరిస్థితిలో గణనీయ మార్పు 
గతంలో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే కష్టంగా ఉండేది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేద­ల పాలిట వరాలుగా మారాయి. వీరి జీవన ప్రమాణాలు పెరిగాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెనలతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలాంటి విద్యార్థుల ఎదుగుదల, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చివేస్తున్నాయి.  
– ఎం.నాగేంద్ర, రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, బీటీ కళాశాల, మదనపల్లె 

కుటుంబసభ్యులతో జాన్‌బాబు
► జాన్‌బాబు కుటుంబానికి కలిగిన లబ్ధి విదేశీ విద్యాదీవెన రూ.51,00,000
►విద్యాదీవెన రూ.3,28,000
►వసతి దీవెన రూ.20,800
►అమ్మ ఒడిరూ.75,000
►సున్నా వడ్డీ రూ.1,167
►ఇంటి స్థలం రూ.6,00,000
►పాస్టర్ల గౌరవ వేతనం రూ.1,25,000

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)