Breaking News

దశాబ్దాల కల నెరవేరిన వేళ...

Published on Mon, 04/29/2024 - 03:07

మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా

మూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్‌లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్‌ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.

ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి  రూ.3 వేలు గీత కార్మిక పింఛన్‌ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.

సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి.  ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.

చేయూత అందించారు 
ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళల­కు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపక­రిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయ­స్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపో­తున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలం

వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి 
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక    రూ.1,40,750. 
వైఎస్సార్‌ చేయూత           రూ.56,250 
ఇంటి స్థలం విలువ          రూ.2,00,000 
ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం    రూ.1,80,000 
మొత్తం లబ్ధి    రూ.5,77,000

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)