Breaking News

లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు

Published on Sat, 10/25/2025 - 05:14

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హ­త్య కేసును నీరు గార్చే యత్నాలు జరుగుతున్నా­యని కాపు, బలిజ సంఘాల జేఏసీ ఆందోళన వ్య­క్తం చేసింది. విచారణ లోపభూయిష్టంగా సా­గు­తోందని, సా­క్ష్యా­లు సక్రమంగా సేకరించడం లే­దని ఆరోపించింది. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సా­యాన్ని పెంచడంతోపాటు జు­్యడీషియల్‌ లేదా సీ­బీ­ఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేసింది. శు­క్ర­వారం విజయవాడలో­ని ఐలాపురం కన్వెన్షన్‌ హా­లులో నిర్వహించిన కాపు, బలిజ సంఘాల ఆత్మీయ సమావేశంలో రా­ష్ట్రంలో కాపులపై జరుగుతున్న దాడులు, కార్యాచర­ణపై జేఏసీ నేతలు చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిచంద్రప్రసాద్‌ వల్ల తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మీనాయు­డు గుడ్లూరు పోలీసులకు మొర పెట్టుకున్నా ప­ట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హరిచంద్ర ప్రసాద్‌ తన కారుతో తొక్కించి అతి దారుణంగా హ­త్య చేశాడన్నారు. అక్టోబర్‌ 2న ఘటన జరిగితే పది రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదన్నా­రు. కాపు, బలిజ సంఘాల నేతలు అక్కడికి వెళ్లి నిల­దీస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 లక్షలు తీసుకుని ఓ మంత్రి ద్వారా కేసును నీరు గార్చే యత్నం చేస్తున్నారని జేఏసీ నేత ఆమంచి స్వాములు ఆరోపించారు. 

హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చి­త్రీ­­కరించే యత్నాలు చేశారన్నారు. కాపు, బలిజ సంఘాల ఆందోళన వల్లే లక్ష్మీనాయుడు హత్య వె­లు­గులోకి వచ్చిందన్నారు. ఎవరి తాత సొమ్ము అ­ని ఆర్థిక సాయం చేస్తున్నారంటూ రిటైర్డ్‌ ఐపీఎ­స్‌ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరి­గితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఆయన ఇంటికి వెళ్లి రూ.కోటి ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కుల రాజ­కీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చే­య­డం సరి­కాదని జేఏసీ నేత దాసరి రాము పేర్కొన్నారు. 

హత్య జరిగిన పది రోజులకు కూడా ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే తాము వెళ్లాల్సి వచ్చిందన్నారు. బాధితుడి కుటుంబానికి న్యా­యం చేయాలనే తాము డిమాండ్‌ చేస్తున్నామన్నా­రు. మానవీయ కోణంలోనే పరిహారం పెంచాలని కోరు­తున్నట్లు చెప్పారు. వీర­య్య చౌదరి కుటుంబా­నికి రూ.కోటి ఇస్తే ఆ రోజు మీ నో­రు పడిపోయిందా? అని నిలదీశారు. లక్ష్మీనాయు­డు కుటుంబా­నికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?