Breaking News

వైజాగ్‌ కేంద్రంగా పాలన: ‘విశాఖ వందనం’ ప్రచార రథం ప్రారంభం

Published on Sat, 10/07/2023 - 10:05

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన రాజధానిగా విశాఖ వర్థిల్లాలని సంపత్ వినాయక దేవాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ‘విశాఖ వందనం’ ప్రచార రథాన్ని రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ జేఏసీ చైర్మన్‌ హనుమంతు లజపతిరాయ్‌ ప్రారంభించారు. నేటి నుంచి పరిపాలన కేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టనున్న పరిపాలన సజావుగా సాగాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని లజపతిరాయ్‌ అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ ప్రజలందరితో కలిసి శనివారం నుంచి దశలవారీగా సర్వమత ప్రార్థనలు చేస్తామన్నారు.

రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జేఏసీ తరఫున దేవాలయాలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నాన్‌ పొలిటికల్‌ జేఏసీ సమావేశంలో ఇటీవల తీర్మానించినట్లు వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)