Breaking News

ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట

Published on Tue, 02/27/2024 - 03:42

సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది.

ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్‌ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్‌ చెల్లింపులు, ఒక మొబైల్‌ నుంచి పలు మొబైల్‌ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటు­వంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులను ఏర్పా­టు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)