Breaking News

21న బ్లూబర్డ్‌–6 ప్రయోగం

Published on Sun, 12/14/2025 - 04:53

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్డ్‌–6 అనే కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఈనెల 21న ప్రయోగించబోతోంది. ఇస్రో రూపొందించిన బాహుబలి (ఎల్‌వీఎం3–ఎం6) రాకెట్‌ ద్వారా దీనిని నిర్వహించనుంది. అక్టోబర్‌ 19వ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. ఈ ప్రయోగాన్ని గత నెలలో నిర్వహించాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వచ్చింది. 

అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. గతంలో పంపిన బ్లూబర్డ్‌ ఉపగ్రహాల కన్నా.. 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల మధ్య ఇది రెండో అతిపెద్ద సహకారం. 

జూలైలో ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహాన్ని.. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 31న పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు కూడా ఇస్రో చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)