బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
డిసెంబర్ లోపు పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగం
Published on Wed, 09/09/2020 - 09:18
సాక్షి, సూళ్లూరుపేట: కోవిడ్–19 మహమ్మారి కారణంగా ప్రయోగాలను వాయిదా వేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఒక్క ప్రయోగమైనా చేయాలని భావిస్తోంది. అలాగే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు మరో మూడు ప్రయోగాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో.. క్రమేపి లాక్‌డౌన్‌ను సడలించుకుంటూ అన్ని విభాగాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ 50 శాతం మంది అధికారులు, సిబ్బంది ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసుకుంటోంది.
- ఈ ఏడాది డిసెంబర్ నెలలోపు పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు పీఎస్‌ఎల్‌వీ సీ50.. ఈ ఏడాది మార్చి 5న ఆఖరి నిమిషంలో వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ప్రయోగాన్ని 2021 మార్చి ఆఖరు నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
- చిన్న చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని కూడా మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
#
Tags : 1