Breaking News

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్‌

Published on Sun, 12/31/2023 - 05:45

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్‌టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్‌ ఆ«థరైజేషన్‌ సమావేశం నిర్వహించి రిహార్సల్స్‌ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం.  

260 టన్నుల బరువు.. 
పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్‌ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్‌ మొదటి దశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్‌ అలోన్‌ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు.

రాకెట్‌ దూసుకెళుతున్న తరుణంలోనే 175 ­సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్‌ షీల్డ్‌ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్‌ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్‌ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్‌ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)