Breaking News

18న పీఎస్‌ఎల్‌వీ సీ–61 ప్రయోగం

Published on Tue, 05/13/2025 - 05:20

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి  ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయో­గాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ  రాకెట్‌ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (రీశాట్‌–1బీ)ను ప్రయోగిస్తున్నారు.

 ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ప్రస్తుతం భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం భారత సైన్యానికి అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి దాకా ఉన్న ఈఓఎస్‌ ఉపగ్రహాల సిరీస్‌ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన  సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన  పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు. 

పూర్తిస్థాయి సమాచారం అందిస్తుంది 
భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్‌ కలిగిన చాయా చిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోనే టెస్ట్‌ వెహికల్‌–డీ2 (టీవీ–డీ2) మిషన్‌ను రోదశిలొకి పంపిస్తున్నారు. అబార్ట్‌ దృశ్యాలను అనుకరించడానికి, గగన్‌యాన్‌ క్రూ ఎస్కేప్‌ సిస్టంను ప్రదర్శించడానికి దీన్ని రూపొందించారు.

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ61 ఉపగ్రహ వాహకనౌక

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)