2019–24 మధ్య రాష్ట్రంలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

Published on Mon, 07/29/2024 - 05:14

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారితో  రెండేళ్లు ప్రపంచం స్థంభించిపోయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం గణనీయమైన సంఖ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల)ను సాధించింది. 2019 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోకి రూ.7,371.68 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టంచేశాయి. 

ఈ ఐదేళ్లలో వివిధ దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. జపాన్‌కు చెందిన యకహోమా, టోరో, దైకిన్, యూరోప్‌కు చెందిన పెట్రోగ్యాస్, కొరియాకు చెందిన ఎల్‌జీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. హిల్‌టాప్‌ సెజ్‌ (అడిదాస్‌), మాండలీజ్‌ చాక్లెట్స్‌ వంటి సంస్థలు భారీగా విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. 

వీటితోపాటు జర్మనీకి చెందిన పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ పలమనేరు వద్ద  రూ.4,640 కోట్లతో యూనిట్‌ పెట్టడానికి ముందుకొచి్చంది. వాస్తవ రూపందాల్చిన పెట్టుబడులు, కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోకి రూ.35,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.

ముందంజలో విశాఖ, నెల్లూరు జిల్లాలు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ, నెల్లూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రాష్ట్రంలోకి రూ.64.49 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఇందులో విశాఖ జిల్లాకు రూ.39.91 కోట్లు రాగా, నెల్లూరు జిల్లాకు 19.29 కోట్లు వచ్చాయని, మిగిలిన మొత్తం అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. 

2023 – 24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే రాష్ట్రంలోకి రూ.764.68 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, వియత్నాం, అబుదాబీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)