Breaking News

నెటిజన్లలో మన ‘సిటి’జన్లు టాప్‌

Published on Fri, 10/11/2024 - 04:26

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్‌ వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ యువతలో 93.7 శాతం ఇంటర్నెట్‌ వినియోగిస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో పురుషులు, మహిళలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్‌ వాడుతున్నారు. ఈ విషయాలు జూలై–2022 నుంచి జూన్‌–2023 వరకు నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్‌ సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 

ప్రధానంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ, యువకులు ఇంటర్నెట్‌ వినియోగంపై రాష్ట్రాల వారీగా సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత దేశ సగటును మించి ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌లో 91.1 శాతం మంది వాడుతున్నారు. 

15 నుంచి 24 ఏళ్ల మధ్య పురుషులకు సంబంధించి దేశంలో సగటున 89.1 శాతం మంది, మన రాష్ట్రంలో 94.6 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. దేశంలో సగటున మహిళలు 80.0 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తుండగా... రాష్ట్రంలో 87.3 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు సర్వే స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో దేశ సగటుకన్నా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 75.6 శాతం, బిహార్‌లో 76.4 శాతం, ఒడిశాలో 80.6 శాతం ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)