Breaking News

మూర్ఛకు శాశ్వత పరిష్కారం

Published on Sun, 10/20/2024 - 05:33

సాక్షి, విశాఖపట్నం: వైద్య రంగాన్ని కలవరపెడుతున్న మూర్ఛ (ఎపిలెప్సీ) రోగానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ మూర్ఛరోగ నిపుణుడు, క్లీవ్‌ల్యాండ్‌ ఎపిలెప్సీ సెంటర్‌ న్యూరో డైరెక్టర్‌ డాక్టర్‌ ఇమద్‌ ఎం నజ్మ్‌ చెప్పారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ (ఐయాన్‌కాన్‌)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు విశాఖ వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడా­రు. 

కొన్ని దేశాల్లో మూర్ఛ రోగానికి శస్త్రచికిత్సలు చేసినా.. ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోతున్నామన్నారు. నాడీ సంబంధిత వ్యాధులు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనకబడే ఉన్నామన్నారు. ఎపిలెప్సీపై పరిశోధనలు వేగవంతమవుతున్నా­యని తెలిపారు.  ఆయన ఏమన్నారంటే.. 

ప్రతి ఆరుగురిలో ఒకరికి నరాల సమస్య
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండటం కలవరపెట్టే అంశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మూర్ఛతో జీవిస్తున్నారు. 10 లక్షల మంది మెసియల్‌ టెంపోరల్‌ లోబ్‌ ఎపిలెప్సీతో బాధపడుతున్నా­రు. మెదడులో వైకల్యాలు అని పిలిచే మూర్ఛ రోగం వైద్య రంగంలో క్లిష్టంగా మారుతోంది.

మెదడు అధ్యయనం అంటే.. అది మూర్ఛ కావచ్చు, అల్జీమర్స్‌ కావచ్చు, స్ట్రోక్‌ కావచ్చు, పార్కిన్సన్‌ కావచ్చు. నాడీ సంబంధిత వ్యాధు­లు ఇటీవల ఎక్కువయ్యా­యి. వయ­సుతో పాటు ఈ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 15 మందికి మూర్ఛ రోగం ప్రమాదకరంగా మారే అవకాశాలు పెరుగుతు­న్నాయి. అందుకే మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యా­ధు­లపై పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం.

శస్త్ర చికిత్సల్లో మూడొంతులు విఫలం 
మూర్ఛకు  శస్త్రచికిత్స అంటూ  లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొ­న్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని చెబు­తున్నారు. అం­టే మెదడులోని టెంపోరల్‌ లోబ్‌కు సం­బంధించిన భాగాన్ని తొలగించడం మూ­ర్ఛ­కు ఉన్న ఏకైక శస్త్రచికిత్స.  ఇది అంత విజయవంతం కాదు. 

ఇప్పటివరకు చేసిన ఈ తరహా చికిత్సల్లో మూడొంతులు విఫలమవుతు­న్నా­యి.   మందుల ద్వారా కూడా అంత ఫలితాలు రావడం లేదు. మూర్ఛ రోగం వచ్చిన ప్రతి 100 మందిలో 90 శాతం  రోగులు మందులు వాడుతున్నారు. వీరిలో కేవలం 44 శాతం మందికే ఫలితాలు దక్కుతున్నాయి.

అమెరికా పరిశోధనలు సఫలీకృతం
అమెరికాలో ఎపిలెప్సీపై 2007 నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. 2007లో లేజర్‌ థెరపీకి అనుమతి లభించింది. 2013లో న్యూరో స్టిమ్యులేషన్, 2018లో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌), 2019లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్‌ అ్రల్టాసౌండ్‌ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు చేసేందుకు అనుమతి లభించింది. ఇది విజయవంతమయ్యే దిశగానే పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. నాడీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, రోగ నిర్ధారణ చేయడంఅనేది వైద్య ప్రపంచానికి  పెద్ద సవాల్‌గా మారింది. 

హృద్రోగాల్ని ఎలాగైతే ముందుగానే పసిగట్టే వ్యవస్థ  అందుబాటులోకి వచ్చిందో.. అదేవిధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2050 నాటికి న్యూరో సంబంధిత వ్యాధులకు సంబంధించి సంపూర్ణ చికిత్స వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని      ఆశిస్తున్నాం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)