Breaking News

అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి

Published on Fri, 07/11/2025 - 05:35

భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో గురువారం సాయంత్రం ఇంటర్‌ విద్యార్థిని లేళ్ల మానస (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భీమడోలు పంచాయతీ శివారు అర్జావారి­గూ­డేనికి చెందిన ఈ బాలిక కళాశాల బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. 

‘మా కుమార్తె మానస కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. పొలసానిపల్లి గురుకుల కళాశాలలో మెగా పేరెంట్స్‌ టీచర్‌ సమావేశానికి ఆహ్వానం వస్తే వచ్చాం. మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాతోనే ఉంది. బాగా మాట్లాడింది. కళాశాలకు వచ్చి వారం రోజులే అయ్యింది.. ఊరికి రమ్మంటే దసరా సెలవులకు వస్తానని చెప్పింది. ఇంతలోనే మరణ వార్తను వినాల్సి వచ్చింది. 

మా కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదు’ అని తల్లిదండ్రులు లేళ్ల మరియమ్మ, రాజు తెలిపారు. తహసీల్దార్‌ బి.రమాదేవి, సీఐ యుజే విల్సన్, ఏలూరు ఆర్‌డీవో అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు. బాలిక మృతికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టాలని, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)