Breaking News

‘నారాయణ’ ఫీ‘జులుం’కి విద్యార్థి బలి..

Published on Fri, 01/24/2025 - 05:44

అనంతపురం ఎడ్యుకేషన్‌/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకు­న్నాడు.

ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్‌ అనంతపురం నగర శివారు సోము­లదొడ్డి ­స­మీ­పంలోని నారాయణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. 

సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచి­పెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసిన­ట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయ­కు­లు తెలిపారు. చరణ్‌ సోదరుడు సర్దిచెప్పి వెళ్లా­డు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్‌ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు. 

తలకు బలమైన గాయాలై అక్కడిక­క్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజ­మాన్యం చరణ్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసే­శారు. 

కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«­ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐ­ఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ కూడా డిమాండ్‌ చేసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)