Breaking News

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Published on Sat, 03/01/2025 - 04:35

సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో గంట ముందుగానే 8 గంటలకు విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్దులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు. విద్యార్దులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్దులను తనిఖే చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చారు. 

ఈ విద్యా సంవత్సరంలో 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌కు 44,581 మంది ఉన్నారు. రెండో ఏడాది విద్యార్థులు జనరల్‌ 4,71,021 మంది, ఒకేషనల్‌కు 42,328 మంది ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్‌ (సీవోఈ) సుబ్బారావు తెలిపారు. 

అన్ని సెంటర్‌లు, పరీక్ష గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, సెంటర్‌ సూపరింటెండెంట్లకు బోర్డు నుంచే ప్రత్యేక ఫోన్‌ సిమ్‌ కార్డులను ఇచ్చామని చెప్పారు. ప్రశ్న పత్రాలు ట్యాంపరింగ్, పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు క్యూ ఆర్‌ కోడ్, వాటర్‌ మార్కులో కోడ్ నంబర్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు