Breaking News

క్యాడర్‌ను బట్టి లంచం!

Published on Sat, 11/30/2024 - 05:18

సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్‌ఆర్‌ నమోదు చేయలేదని మరొక మెడికల్‌ ఆఫీసర్‌... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్‌ డిక్లరేషన్‌(రెగ్యులరైజేషన్‌) చేశారని ఇంకొకరు... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంవో)లు అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్‌ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్‌... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. 

ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్‌ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మెడికల్‌ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మంతనాలు! 
తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ డీఎంహెచ్‌వో... కొందరు మెడికల్‌ ఆఫీసర్‌లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్‌వో బతిమిలాడినట్లు సమాచారం. 

అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్‌ ఆఫీసర్లు సైతం పీహెచ్‌సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్‌ గ్రూప్‌లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)