Breaking News

మెడికల్‌ భారం.. బీమాతో కొంత దూరం

Published on Wed, 12/11/2024 - 05:25

సాక్షి, అమరావతి: పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి చుట్టుముట్టేస్తున్నాయి. మరోవైపు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వచ్చే డెంగీ, మలేరియా, విషజ్వరాలు విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. వెరసి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. 

దీంతో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి గట్టెక్కడానికి బీమాను నమ్ముకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని ఫలితంగా గత మూడేళ్లలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 30 శాతం పెరిగాయి. దేశంలో సగటు క్లెయిమ్‌ పరిమాణం 2023లో రూ.62,014 ఉండగా, ప్రస్తుత ఏడాది రూ.70,152కు చేరుకుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.81,025కు చేరుకుంటుందని అంచనా. 

ఈ విషయాలు ఇటీవల పాలసీ బజార్‌ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. డెంగీ, మలేరియా, విష జ్వరాలు తదితర సీజనల్‌ వ్యాధులతోపాటు గుండె, క్యాన్సర్‌ వంటి జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.  

యువత అధికం... 
ముఖ్యంగా యువత బీమా క్లెయిమ్‌లలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. 2024లో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో 18–35 మధ్య వయసు గల యువత వాటా 38.20 శాతం ఉంది. 36 నుంచి 45 మధ్య వయసు గల వారి వాటా 29.50 శాతం. దేశంలోని మొత్తం క్లెయిమ్‌లలో 14.5 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 10.2 శాతంతో ఢిల్లీ, 5.90 శాతంతో హరియాణ వరుస స్థానాల్లో ఉన్నాయి. 

గడిచిన ఐదేళ్లలో గుండె చికిత్స క్లెయిమ్‌లు రెట్టింపు కావడంతోపాటు చికిత్సల ఖర్చులు 53 శాతం పెరిగాయి. ఇక గుండె జబ్బు, సహజ మరణాలు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు కూడా అధికంగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించి 25–30 శాతం, సహజ మరణాలు– 30–35 శాతం, ప్రమాదాలు–15.20 శాతం చొప్పున క్లెయిమ్‌లు నమోదయ్యాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)