ప్రజాస్వామ్య పునాదులపై దాడి

Published on Sun, 09/14/2025 - 01:32

సాక్షి, న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) తీవ్రంగా ఖండించింది. ‘సాక్షి’మీడియా సంస్థ, వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్‌ఎస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు ఎం.వి. శ్రేయామ్స్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఐఎన్‌ఎస్‌ అభివర్ణించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి, విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్‌ఎస్‌ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్‌ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణి.. 
ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్‌ఎస్‌ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయామ్స్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్‌ఎస్‌ పేర్కొంది. 

మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలి.. 
ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ మేరీ పాల్‌ కూడా తెలిపారు.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)