Breaking News

విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై విచారణ

Published on Tue, 11/19/2024 - 03:56

జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్‌ సెకండియర్‌కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికా­రులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మా­డు­గుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థి­నులను విచారించారు. 

కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజల­కు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి­(ఎస్‌వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్‌వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు. 

ఎస్‌వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్‌వో సాయి­ప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీ­రావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగి­న చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేది­క­ను తమకు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు కమిషన్‌ చైర్‌ప­ర్సన్‌ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్‌వోను బ్లాక్‌మెయిల్‌ చేసిన టీడీపీ నేత
ఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్‌లు, ఎంపీటీ­సీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావా­లంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్‌వోను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తమ పేర్లు వాడినందు­కు రామకృష్ణపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Students Hair Cuts: కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)