Breaking News

రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం 

Published on Fri, 02/23/2024 - 05:02

సాక్షి, అమరావతి: మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మద్దతు ధరకు  సేకరణ... 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా.

ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది.

గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్‌ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. 

సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం 
పంట నమోదు (ఈ–క్రాప్‌) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు.

పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్‌ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్‌ కోడ్‌/ఆర్‌ఎఫ్‌ ఐడీట్యాగ్‌ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్‌ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్‌ పార్టీ ఆడిట్‌ చేస్తున్నారు.

పారదర్శకంగా కొనుగోళ్లు... 
కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం.   – డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)