Breaking News

రాష్ట్రంలో 2019–20లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6.46%

Published on Sun, 08/21/2022 - 05:20

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి 6.46 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వార్షిక సర్వే నివేదిక వెల్లడించింది. 2018–19లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.3,76,143.34 కోట్లు కాగా 2019–20లో రూ.4,00,462.83 కోట్లుగా తెలిపింది. అంటే 2018–19తో పోలిస్తే 2019–20లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.24,319.49 కోట్లు (6.46 శాతం) పెరిగినట్లు సర్వే పేర్కొంది. కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో 2019–20కి సంబంధించిన పారిశ్రామిక సర్వేని ఆలస్యంగా.. 2021 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

ఈ సర్వే నివేదికను కేంద్ర కార్యక్రమాలు అమలు గణాంకాలశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్రంలో కొత్తగా 185 ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 2018–19లో రాష్ట్రంలో 16,739 ఫ్యాక్టరీలుండగా 2019–20లో ఆ సంఖ్య 16,924కు పెరిగింది. 2019–20లో రాష్ట్రంలో మొత్తం 6.63 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2018–19తో పోలిస్తే  2019–20లో ఉపాధి కల్పించిన వారిసంఖ్య 30,432 పెరిగింది. 2018–19లో 6.33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 2018–19తో పోలిస్తే 2019–20లో 29,105 పెరిగింది.

2018–19లో 5.12 లక్షలమంది కార్మికులు పనిచేస్తుండగా 2019–20లో వారిసంఖ్య 5.41 లక్షలకు చేరింది. 2018–19లో కార్మికులకు వేతనాల రూపంలో రూ.8,954.25 కోట్లు చెల్లించగా 2019–20లో రూ.10,243.15 కోట్లు చెల్లించారు. 2019–20లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.29,921 కోట్లు కాగా నికరలాభం రూ.9,584 కోట్లు. 2018–19లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.23,406 కోట్లు కాగా నికరలాభం రూ.5,562 కోట్లు.

1948 ఫ్యాక్టరీల చట్టం కింద ఏర్పాటైన పదిమందికి మించి కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణసంస్థలు, చమురు నిల్వ, పంపిణీ డిపోలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, కంప్యూటర్‌ సేవలు, రైల్వే వంటి డిపార్ట్‌మెంటల్‌ యూనిట్లు, వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ మింట్‌లు, శానిటరీ, నీటిసరఫరా, గ్యాస్‌ నిల్వ మొదలైనవాటిని సర్వే పరిధి నుంచి మినహాయించారు.   

Videos

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర

Photos

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)