కూటమి భయపడే ఇలా చేస్తుంది
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం
Published on Sat, 11/11/2023 - 06:20
సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం..
- సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది.
- ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్ డీడ్‌ను అందజేస్తారు.
- అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు.
- అలాగే, డీపీఆర్ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు.
- ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్ చేస్తారు.
- ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు.
- ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
#
Tags : 1