Breaking News

నేటి నుంచి ముంబై–విజయవాడకు ఇండిగో సర్వీస్‌

Published on Fri, 08/16/2024 - 05:34

గన్నవరం: వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్న­వరం విమానాశ్రయా­నికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌­లైన్స్‌ వర్గాలు తెలిపాయి. 

ఈ సర్వీస్‌ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూ­రప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణి­కులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–­విజ­య­వాడ మధ్య ఎయిరిండియా సర్వీస్‌ నడుస్తుండగా, ఇప్పు­డు ఇండిగో రాకతో మరో సర్వీస్‌ అందుబా­టులోకొ­చ్చి­న­ట్లయిందని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలి­పా­యి.
  
సెప్టెంబర్‌ 14 నుంచి న్యూఢిల్లీ–విజయవాడ సర్వీస్‌
సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌­బస్‌ ఎ320 విమానం రోజూ ఉదయం 8.10 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి 10.40కి విజయ­వాడ చేరుకుంటుంది. తిరిగి 11.10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి న్యూఢిల్లీ చేరుకుంటుంది. 

ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్‌లను నడుపు­తోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్‌ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)