Breaking News

రైలు ప్రమాదాల నివారణలో మరో ముందడుగు

Published on Tue, 09/02/2025 - 04:27

తాటిచెట్లపాలెం: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో రైలు ప్రమాదాల నివారణకు మరో ముందడుగు పడింది.  ఇందుకు సంబంధించి ప్రత్యేక ‘కవచ్‌’ (ట్రైన్‌ కొలైజన్‌ అవాయ్‌డెన్స్‌ సిస్టం–టీఏసీఎస్‌) అమర్చిన తొలి డీజిల్‌ లోకోను (ఇంజన్‌) వాల్తేర్‌ డివిజన్, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌బోహ్ర సోమవారం ప్రారంభించారు. వాల్తేర్‌ డివిజన్, డీజిల్‌ లోకోషెడ్‌లో సోమవారం ఈ కార్య­క్రమం జరిగింది.

డీజిల్‌ లోకో షెడ్‌ సిబ్బంది మొదటిగా డబ్ల్యూఏజీ–9హెచ్‌సీ ఫ్రైట్‌ లోకోకు కవచ్‌ను అమర్చారు. అంచెలంచెలుగా మరో 123 లోకోలకు మొదటి ఫేజ్‌లో కవచ్‌లను ఏర్పాటుచేయనున్నారు. వాల్తేర్‌ డివిజన్‌ పరి«ధిలో గల డీజిల్‌ లోకో షెడ్‌ ఇప్పటికే 500 మీటర్ల కవచ్‌ ఆధారిత టెస్టింగ్‌ ట్రాక్‌ను కూడా కలిగి ఉండడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

తొలి ‘కవచ్‌’ డీజిల్‌ లోకో ప్రారంభం నేపథ్యంలో రైలు ప్రమాదాల నివారణ దిశగా వాల్తేర్‌ డివిజన్‌ మరో రికార్డు నెలకొల్పినట్లయ్యింది. రైళ్ల భద్రతకోసం అత్యాధునికంగా తయారుచేసిన ఈ కవచ్‌ వలన రైలు ప్రమాదాలను నిలువరించవచ్చు. ఇది లోకోలో ఏర్పాటుచేసే ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ సిస్టం. దీనివలన సురక్షిత వేగం, ప్రమాదకర పరిస్థితుల్లో రైలు నియంత్రణ సాధ్యమవుతుంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)